NEWS

Blogger Widgets

26.6.12

పార్వతి మిల్టన్ బరువుకి బాలకృష్ణే కారణం?


సోమవారం, జూన్ 25, 2012, 15:25 [IST]

Parvathi Gained Weight Balakrishna
'దూకుడు' ఐటం సాంగ్ లో పార్వతి మిల్టన్ చూసిన వారికి ఇప్పుడు బాలకృష్ణ తాజా చిత్రం శ్రీమన్నారాయణ చూసినవారికి చాలా తేడా కనపడుతోంది. ఆమె కొన్ని పౌండ్ల బరువు పెరిగి అందర్ని ఎట్రాక్ట్ చేస్తోంది.
ఇప్పుడు ఆమెకు తెలుగులో పెద్ద ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. జల్సా వంటి సూపర్ హిట్ పడినా కెరిర్ కిక్ ఇవ్వని ఆమెకు బాలకృష్ణ సినిమాలో చూసి పిలుపులు వస్తున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.
అయితే అలా ఆమె బరువు పెరిగి లుక్ కనపడటానికి బాలకృష్ణే కారణమంటున్నారు. బాలకృష్ణ షూటింగ్ మొదటి రోజే ఆమెకు ఒళ్లు పెంచి నదురుగా కనపడాలని సలహా ఇచ్చినట్లు చెప్తున్నారు. తనకు జోడీగా ఉండాలంటే ఆ మాత్రం పెరగాల్సిందే అని బాలయ్య పట్టుబట్టబట్టే ఈ రోజు ఆమెకు ఆఫర్స్ వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. జల్సా తర్వాత త్రివిక్రమ్ తన తదపురి ఖలేజా చిత్రంలో ఆఫర్ ఇస్తాడని భావించిన ఆమె అలా జరగకపోవటంతో నిరాశకు లోనై పరిశ్రమకు దూరం అయ్యింది. మళ్లీ దూకుడు తర్వాత ఆమె దృష్టిని నటనపై పెట్టింది.
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్ పతాకంపై రమేష్ పుప్పాల ‘శ్రీమన్నారాయణ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ‘బాలకృష్ణ కెరీర్‌లో సంచలనాత్మకమైన చిత్రంగా ‘శ్రీమన్నారాయణ'ను తీర్చిదిద్దుతున్నాం. పద్మాలయా స్టూడియోలో వేసిన సెట్‌లో బాలకృష్ణ, పార్వతి మెల్టన్, ఇషాచావ్లాలపై ‘ఆరడుగుల అబ్బాయి.. హ్యాండ్‌సమ్ నువ్వోయి' అనే పాటను ఆరు రోజుల పాటు చిత్రీకరించాం. జూన్‌లో యూరప్‌లో మూడు పాటలు, మలేషియాలో ఓ ఫైట్ చిత్రీకరిస్తాం. దీంతో చిత్రీకరణ పూర్తవుతుంది' అన్నారు.
విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్ నాగినీడు, సుప్రీత్, సుధ, తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఘటికాచలం, కెమెరా: సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: సురేష్ కుమార్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.