సోమవారం, జూన్ 25, 2012, 17:00 [IST]
గుంటూరు: జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటుంది. అవినీతికి, సినీ నటి రంజితతో రాసలీలల కేసులో ఇరుక్కున్న నిత్యానంద స్వామికి లింక్ పెట్టి ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో అటు వైపు వెళ్లే వారి అందరి దృష్టిని అది ఆకర్షిస్తోంది. విషయానికి వస్తే నిత్యానంద స్వామికి, అవినీతికి లింక్ పెడుతూ గుంటూరులో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ది మూన్ సేన పేరుతో దీనిని ఏర్పాటు చేశారు.
అందులో నిత్యానందకు వెటకారపు వ్యాఖ్యల ద్వారా స్వాగతం పలికారు. ఆయనకు వెటకారంగా స్వాగతం పలుకుతూనే రాష్ట్రంలోని అవినీతిపై కూడా ఎద్దేవా చేశారు. ఆ ప్లెక్సీలో.. తమిళనాడు, కర్నాటకలలో ఛీత్కారాలతో సతమతమవుతున్న నిత్యానంద స్వామికి సాదర స్వాగతం.. నేటి మా ఎపి అక్రమార్కులకు, అవినీతిపరులకు అండగా ఇక్కడి క్రింది స్థాయి న్యాయవ్యవస్థ వరకు జీతాలు తీసుకుంటున్న వారు అవినీతికి పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నారు.
ఈ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలోని అవినీతి, నిత్యానంద స్వామి లీలలకు పెద్దగా తేడా లేదని అంతకన్నా అవినీతే అతి దారుణమన్నట్టుగా ఫ్లెక్సీలో పేర్కొనడం ఆకర్షిస్తోంది. అవినీతిని విమర్శిస్తూనే నిత్యానందకు వెటకారంగా స్వాగతం పలకడం విశేషం. కాగా నిత్యానంద స్వామి సినీ నటి రంజితతో రాసలీలల కేసుతో బజారున పడ్డ విషయం తెలిసిందే. అప్పటి నుండి నిత్యానందను ఏదో ఒక వివాదం చుట్టుకుంటోంది.
రంజితతో రాసలీలల వ్యవహారం రెండేళ్ల క్రితం బయటపడింది. ఆ తర్వాత మరో తమిళ నటిపై పలుమార్పు రేప్‌కు పాల్పడ్డాడని, పవిత్ర జలంలో డ్రగ్స్ కలుపుతున్నారని, తాజాగా పులి చర్మం కప్పుకొని దీక్ష చేస్తున్నారని, ఏనుగు దంతాలు కూడా ఆయన ఆశ్రమంలో ఉన్నాయనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.