NEWS

Blogger Widgets

26.6.12

జగన్‌ వద్దు.. కాంగ్రెస్సే ముద్దంటున్న ఎమ్మెల్యే జయమణి!!


congress
File
FILE
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి జైకొట్టిన విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి ఇపుడు సొంత పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు ముందు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైఎస్.విజయమ్మ పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రచారంలో ఉండగా జయమణి స్వయంగా వెళ్లి విజయమ్మను కలిసి తన సంఘీభావం ప్రకటించారు. 

అయితే, దీనికి ఒక కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిన విజయనగరం ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు ప్రోద్భలంతో ఆమె అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఆ తర్వాత పీసీసీ చీఫ్ బొత్స చేసిన హితబోధ కారణంగా జయమణి మనస్సు మార్చుకుని సొంత పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తాజా సమాచారం. 

కాగా, జయమణి ఆదివారం తన అనుచరులతో హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాగా ఇటీవల బొత్స జిల్లాకు చెందిన బొబ్బిలి శాసనసభ్యుడు సుజయ కృష్ణ రంగారావు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత అదే జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరిగింది. అందులో ఒకరు పార్వతీపురం శాసనసభ్యురాలు సవరపు జయమణి కావడం గమనార్హం.