భువనేశ్వర్, న్యూస్‌లైన్: భువనేశ్వర్-తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు శనివారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ రైలు భువనేశ్వర్ నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి ఆదివారం ఉదయం 8.25 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరి సోమవారం ఉదయం 10.10 గంటలకు భువనేశ్వర్ చేరుతుంది. ఖుర్దారోడ్, బలుగావ్, ఛత్రపురం, సోంపేట, బరంపురం, పలాస, శ్రీకాకుళంరోడ్, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
|