NEWS

Blogger Widgets

13.7.12

చెరువు అడుగున ఇనుప రేకు!


7/13/2012 12:47:00 AM
మధుర: మధురకు సమీపంలో ఉన్న కొన్ని వేల ఏళ్ల క్రితం నాటి ఓ చెరువులో అద్భుతం ఆవిష్కృతమైంది. నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకకుండా ఇనుప రేకును ఉపయోగించినట్లు గుర్తించారు. కొన్నేళ్లుగా మధుర సమీపంలోని చెరువుల పునరుద్ధరణ చేపట్టిన బ్రజ్ ఫౌండేషన్ గత ఏడాది సున్ఖ్ ్రప్రాంతంలోని ‘రామ్ తాల్ కుండ్’లో తవ్వకాలు జరుపుతోంది. ఇటీవల ఈ చెరువులో సుమారు 15 అడుగుల లోతున ఇనుప రేకు బయటపడింది. దాదాపు రెండు అంగుళాల మందం, 180 అడుగుల పొడవు, 120 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఇనుపరేకు,.. పక్కనే ఉన్న యమునా నది నుంచి వచ్చిన నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకకుండా అడ్డుకునేం దుకు ఉపయోగించి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ......

దేశంలో ఇలాంటి ఇనుపరేకును గుర్తించడం ఇదే తొలిసారని, అయితే మరిన్ని పరీక్షలు జరిపితేనే నిర్దిష్టమైన అంచనాకు రావచ్చునని ఉత్తరప్రదేశ్ పురాతత్వశాఖ అధికారి ఎస్.కె. దూబే అంటున్నారు. ఈ ఇనుపరేకుపైన పురాతన ఇటుకలు కొన్ని లభించాయని, బెంగళూరుకు చెందిన పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ చెరువు సుమారు 2,900 ఏళ్ల క్రితం నాటిదని బ్రజ్ ఫౌండేషన్ చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ వినీత్ నారాయణ్ తెలిపారు. మధుర చుట్టుపక్కల ఉన్న సుమారు 40 చెరువులను తాము పునరుద్ధరిస్తున్నామని వీటన్నింటికీ పురాణ ప్రాశస్త్యం ఉందని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తగు విధంగా స్పందిస్తే... ఈ చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.