న్యూఢిల్లీ: డెన్మార్క్‌తో దౌత్య సంబంధాలను తగ్గించాలని భారత్ నిర్ణయించిం ది. పురులియా ఆయుధాల జారవిడత కేసుకు సంబంధించి నిందితుడు కిమ్‌డెవీని భారత్‌కు అప్పగించేందుకు డెన్మార్క్‌లోని కింది స్థాయి కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చే సే అవకాశం ఉన్నప్పటికీ, డెన్మార్క్ సర్కారు అందుకు నిరాకరించిన నేపథ్యంలో భారత్ దౌత్య సంబంధాలను తగ్గించాలని నిర్ణయించడం గమనార్హం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. సీనియర్ అధికారులు ఎవరూ భారత్‌లోని డెనిష్ దౌత్యవేత్తలతో కలవరాదని, సంభాషించరాదని అందులో స్పష్టం చేసింది.
|