NEWS

Blogger Widgets

18.6.12

చాలా ఎక్కువనీ అర్థమైంది



Jun-17-2012 10:16:36
మగధీర చేసేప్పుడు గ్రాఫిక్స్ విషయంలో చాలా తెలిసిందని అనుకున్నాననీ, కానీ 'ఈగ' చేస్తుంటే నేను తెలుసుకుంది చాలా తక్కువనీ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువనీ అర్థమైందని రాజమౌళి అన్నారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం జూలై 6న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏర్పుటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఇలా వివరించారు.

అలాగే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. 'నా పేరు నాని, నేను ఈగనైతే గానీ' అనే టైటిల్ సాంగ్‌ను హీరో నాని బృందంపై చిత్రీకరించారు. ఈ పాటను ప్రమోషనల్ సాంగ్‌గా ఉపయోగిస్తున్నామనీ, చిత్రంలో ఈ పాటను 'ఈగ'పై తీశామనీ రాజమౌళి చెప్పారు. డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.