ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఆదివారం ఉదయానికే రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించా యని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతికితోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ రాయలసీమ, తెలంగాణా మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఒకటి రెండుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందనీ తెలిపారు. వర్షాలు పడుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|