అచ్చంపేట: మహబూబ్‌నగర్‌జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అచ్చంపేటలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తు కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కేంద్రంలో రిపేరులో ఉన్న సుమారు 20 ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయాయి. పేలుళ్ల శబ్ధానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విద్యుత్ శాఖాధికారులు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరమ్మత్తు కేంద్రంలో చెత్తాచెదారం ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. మూడు ఫైరింజన్లు మంటలార్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
|