NEWS

Blogger Widgets

18.6.12

'అసెంబ్లీ రౌడీ'రీమేక్



Jun-17-2012 10:21:16
మోహన్ బాబు హీరోగా చేసిన 'అసెంబ్లీ రౌడీ'ఆ రోజుల్లో సూపర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలోని అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే నిన్ను కూడా జైల్లోపెడతా... అనే డైలాగులు అప్పట్లో ఎక్కడ విన్నా వినపడేవి. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ 'అసెంబ్లీ రౌడీ'చిత్రం రీమేక్ కాబోతోంది.

మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా ఈ చిత్రం రూపొందనుంది.ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఈతరానికి నచ్చేలా, వర్తమాన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మార్పుచేర్పులు చేస్తున్నారు. ప్రస్తుతం కథాచర్చలు సాగుతన్నాయి. విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'దేనికైనా రెడీ' చిత్రీకరణ తుది దశకు చేరింది. ఈ చిత్రం పూర్తయిన తరవాత 'అసెంబ్లీ రౌడీ' సెట్స్‌ మీదకు వెళ్తుంది. పరుచూరి బ్రదర్శ్ ఈ మేరకు కొత్త స్క్ర్రిప్టుని రెడీ చేస్తున్నారు.