NEWS

Blogger Widgets

18.6.12

మహేష్ ఫ్యామిలీ సీక్రెట్ లీక్



Jun-17-2012 10:19:09
మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకునే రోజు దగ్గర్లోనే ఉంది. మహేష్ బాబు మళ్లీ తండ్రి కాబోతున్నాడని, నమ్రత గర్భం దాల్చిందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. నమ్రత కూడా గర్భంతో ఎప్పుడూ బయట కనిపించలేదు.

ఇంతకాలం సీక్రెట్‌గా ఉన్న ఈ విషయం రామ్ చరణ్ పెళ్లి సందర్బంగా బయటకు లీకైంది. ఈ వేడుకకు భార్య నమ్రతతో కలిసి హాజరయ్యాడు మహేష్ బాబు. ఇక్కడ నమ్రత బేబీ బంప్‌తో కనిపించడంతో అందరి అనుమానాలు నివృత్తి అయినట్లయింది. నమ్రత సాధ్యమైనంత వరకు తన డ్రెస్‌తో బేబీ బంప్‌ను కవర్ చేసే ప్రయత్నం చేసింది.