Jun-18-2012 06:34:15 | |
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. అమీర్‌పేట భూవివాదంలో ఆయనకు ఈ సమన్లు జారీ అయ్యాయి. ఈ భూవివాదంలో కొంతకాలంగా ఆయనపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు2న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
|