
‘‘ఉదయ్‌కిరణ్ తన కెరీర్‌లో తొలిసారిగా పోలీస్ నేపథ్యంలో చేస్తున్న యాక్షన్ సినిమా ఇది. ఇందులో ఆయన కత్తిలాంటి పదునైన క్రైమ్‌బ్రాంచ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఇప్పటివరకూ తను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. లవ్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ల కలబోత ఇది. ఇందులో మొత్తం ‘5’ పాటలుంటాయి’’ అని బాలాజీ.ఎన్.సాయి చెప్పారు.
ఆయన దర్శకత్వంలో ఫైవ్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తేళ్ల రమేష్ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ‘ఈ రోజుల్లో’ ఫేమ్ రేష్మా ఇందులో కథానాయిక. ఈ నెల 18న హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ నెల 18న తొలి షెడ్యూలు మొదలైంది. నెలాఖరు వరకూ హైదరాబాద్‌లోనే జరుగుతుంది.
ఈ షెడ్యూలులో 2 పాటలు, కీలకమైన సన్నివేశాలు, 2 యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తాం. సంగీత దర్శకునిగా డాఖేను పరిచయం చేస్తున్నాం’’అని తెలిపారు. నాగినీడు, చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, గిరిధర్, పృథ్వీ, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా, టెక్నికల్ సపోర్ట్: డిజీ పోస్ట్, ఆర్ట్: భాస్కరరాజు, స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్, సహనిర్మాత: ఎం.సి.హెచ్.రాజేష్.