Jun-19-2012 10:45:07 | |
పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ కాంబినేసన్లో అప్పట్లో వచ్చిన ‘దేశ ముదురు' చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. ప్రస్తుతం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగుతో బిజీగా గడుపుతున్న పూరి జగన్నాథ్ ఈచిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బన్నీ సరసన శృతి హాసన్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నట్లు సమాచారం.
ఈ క్రేజీ కాంబినేషన్ నిర్మాణ బాధ్యతలను గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూరి, అల్లు అర్జున్ కాంబినేషన్ కావడంతో ఇటు సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. |