NEWS

Blogger Widgets

20.6.12

షాడో విశేషాలు


షాడో విశేషాలు
వేంకటేష్‌, శ్రీకాంత్‌, తాప్సీ, మధురిమ ప్రధాన పాత్రదారులుగా యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'షాడో'. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో పరుచూరికిరిటీ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ ముంబయిలో జరగాల్సి వుండగా బాగా వర్షాలు కురుస్తుండ డంతో వాతావరణం అనుకూలించక పోవడంతో అక్కడ షూటింగ్‌ కేన్సిల్‌ చేసి నేరుగా మలేషియా షెడ్యూల్‌కు సన్నాహాలు చేస్తున్నారు.
జులై రెండో వారంలో మలేషియాలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీ, స్విట్జర్లాండ్‌ ప్రదే శాల్లో నిర్వహించారు. ఇందులో వెంకటేష్‌ ఇంటర్నే షనల్‌ డాన్‌గా కన్పిస్తారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కోన వెంకట్‌, గోపీ మోహన్‌లు స్క్రిప్ట్‌ అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్‌ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. శ్రీకాంత్‌ సరసన మధురిమ నటిస్తోంది .ఈచిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కామెడీగా మెండుగా వుంటుందని నిర్మాత తెలియజేస్తున్నారు. సినిమా పేరుకు తగినట్లుగానే మాఫియా బ్యాగ్రౌండ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలిమెంట్స్‌ వుంటుందని ఆయన తెలిపారు.