బెంగళూరు: బెంగళూరులో సోమవారం రాత్రి కిడ్నాప్‌నకు గురైన కాంగ్రెస్ మాజీ ఎంపీ హెచ్‌జీ రాములు కుమార్తె విష్ణువందన(47)ను నగర పోలీసులు కాపాడారు. విష్ణువందన మొబైల్ ఫోన్ నంబరు ఆధారంగా ఆమె చెన్నైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం చెన్నై వెళ్లి కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. విష్ణువందనను బెంగళూరుకు తరలించారు. రూ.30 లక్షల కోసం తన కుమార్తెను కిడ్నాప్ చేశారని రాములు చెప్పడం తెలిసిందే.
|