రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు. మెగా ఫ్యామిలీని నా కుటుంబంగా భావిస్తాను. మా ఇంట్లో ఎవరికయినా వివాహం జరుగుతుంటే నేను తప్పకుండా నా సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు డ్యాన్స్ చేస్తాను అంటోంది తమన్నా. ఈ అమ్మడు ఇటీవల రామ్‌చరణ్ పెళ్లిలో చురుగ్గా పాల్గొన్న సంగతి విదితమే. సంగీత్ కార్యక్రమంలో రెండు పాటలకు కూడా ఇరగదీసే డ్యాన్స్ చేసింది. అందుకు గానూ పారితోషికం అందుకుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అందుకు తీవ్రంగా నొచ్చుకున్ని తమన్నా ఇలా వివరణ ఇచ్చుకుంది. ‘ఎవరింట్లో అయినా డ్యాన్స్‌లు చేయడం సహజమే కదా. నేను నా ఫ్రెండ్ పెళ్ళిలో స్టెప్పులు వేసిన విషయాన్ని మీడియా అంతగా పట్టించుకోవాల్సిన ఆవశ్యకత ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలియకుండా విన్నదీ, ఊహించిందీ చెప్పేస్తే ఎలా?’ అంటూ ఎదురు ప్రశ్నించింది తమ్మూ!
|