నిన్న గాక మొన్న ‘గబ్బర్‌సింగ్’ కోసం ‘కెవ్వు కేక’ అంటూ చిందేసిన మలైకా అరోరాఖాన్ ఆ పాట కోసం ఏకంగా రూ.కోటి లాగేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా అలాంటి అవకాశమే బెబో కరీనా కపూర్ ముంగిట వాలిందిప్పుడు. ఓ ఉత్తరాది భామకి..దక్షిణాదిన మరో భారీ ఆఫర్ ఇది. వివరాల్లోకి వెళితే...ప్రఖ్యాత దర్శకుడు ఎస్.జె.సూర్య తమిళ్‌లో ‘ఇసై’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించాల్సిందిగా అతడు కరీనాని అడిగారట. అందుకోసం ఏకంగా రూ.కోటి చెల్లిస్తానని ఆఫర్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై కరీనా ఇంకా ఏ విషయమూ చెప్పలేదట.
|