Jun-18-2012 11:00:48 | |
ఈ పాత్ర చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. తినే తిండి దగ్గర్నుంచి మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి చేయాల్సిన వర్కవుట్లన్నీ చేశాను. నాలో మార్పు వచ్చిందని కొంతమంది చెబుతుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా నటిగా కూడా నాకు మంచి సంతృప్తినిచ్చింది అంటోంది శ్రీదేవి.
లాంగ్ గ్యాప్ తర్వతా అతిలోక సుందరి శ్రీదేవి చేస్తున్న చిత్రం ‘ఇంగ్లీష్ -వింగ్లీష్'. హిందీలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘చీనీకమ్', ‘పా' చిత్రాలు తీసిన ఆర్.బాలకృష్ణన్ సతీమణి గౌరీ షిండె దర్శకత్వం వహించారు. ‘ఇంగ్లీష్ -వింగ్లీష్' చిత్రానికి కథ, కథనాన్ని ఆమే సమకూర్చుకుంది. చిత్రీకరణ అంతా న్యూయార్క్‌లో జరిగింది. ఇప్పటికే విడుదలైన పస్ట్ లుక్ పోస్టర్స్ , ట్రైలర్స్ అంతటా చర్చనీయాంశంగా మారాయి. |