భూమన దీక్ష సరే... లాటరీలో ఆయన అనుచరుడికి 3 షాపుల మాటేంటి..?!!
తిరుపతి పట్టణంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి దీక్ష చేయడమే కాకుండా, ఆయనకు మద్దతుగా వైకాపా ఒకరోజు బంద్‌కు కూడా పిలుపునిచ్చింది. ఈ తంతు ఇలా జరుగుతుండగానే.... భూమన అనుచరుడిగా పేరున్న నాయకుడు మద్యం లైసెన్సుల లాటరీల్లో ఏకంగా 3 షాపులను దక్కించున్నట్లు సమాచారం.బినామీలో పేరుపై ఇంతకుముందున్న ఒక షాపుతోపాటు ఇప్పుడు మరో 2 షాపులను దక్కించుకున్నట్లు చెపుతున్నారు. మద్య రహితం నగరంగా తిరుపతిని తీర్చిదిద్దాలని దీక్ష బూనిని కరుణాకర్ రెడ్డి మరి తన అనూయాయుల షాపులను మూయిస్తారా...? చూడాలి మరి.