NEWS

Blogger Widgets

29.6.12

బిడిదిలో నిత్యానంద హైటెక్ బెడ్రూం సీక్రెట్స్ బట్టబయలు


FILE
ఇటీవల కాలంలో వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్న నిత్యానంద తాజాగా బెంగళూరులో ఓ విలేకరిపై చేసిన గొడవ, కొరివితో తల గోక్కున్నట్లయింది. హిందూ మక్కల్ కచ్చి ఫిర్యాదు మేరకు నిత్యానంద ఆశ్రమాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు...

తాజాగా బెంగళూరులోని బిడిది ఆశ్రమంలో నిత్యానంద బెడ్రూంలో ఏమేం ఉన్నాయన్నదానిపై కన్నడ టెలివిజన్ ఛానల్ ఒకటి ప్రత్యేకంగా చూపించింది. ధ్యానందపీఠం ఆశ్రమంలో ఆ దృశ్యాలను చూస్తే భక్తులే కాదు సామాన్య మానవులు కూడా నోరెళ్లబెట్టాల్సిందే. 

40 అంగుళాలు ఎల్సీడీ టీవీ, శరీర సౌష్టవాన్ని పెంచుకునేందుకు పరికరాలు, ఆధునిక వస్త్రాలు, డబుల్ కాట్ మంచాలతో సహా, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫర్నీచర్ ఉన్నాయి. అంతేకాదు గదికి ఓ రహస్య ద్వారం కూడా ఉన్నది.