81 ఏళ్ల సినీ చరిత్రలో గబ్బర్‌సింగ్ కొత్త రికార్డు
పవన్‌కళ్యాణ్ కథానాయకుడుగా హరీష్ ఎన్.శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించిన ‘గబ్బర్‌సింగ్’ చిత్రం ఈనెల 29కి 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ 81 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ రికార్డులు సృష్టించి, అపూర్వ ఆదరణ అందుకొంటున్న ‘గబ్బర్‌సింగ్’ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు పూర్తిచేసుకుందని, 306 కేంద్రాలలో..... అద్భుతమైన షేర్స్‌తో శత దినోత్సవానికి పరుగులు పెడుతుండడం ఆనందంగా వుందని, ఈ సందర్భంగా చిత్రాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రేక్షకులకు, పవన్‌కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చినందుకు హీరో, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఈ విజయంకోసం అందరూ అహర్నిశలు పనిచేసిన వారికి థాంక్స్ చెబుతూ తన జీవితానికో టర్నింగ్ పాయింట్‌గా ఈ చిత్రం నిలుస్తుందని దర్శకులు హరీష్‌శంకర్ తెలిపారు. పవన్‌తో చేసిన ఈ చిత్రం తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం ఆనందంగా వుందని కథానాయిక శృతి హాసన్ అన్నారు. సుహాసిని, కోట, బ్రహ్మానందం, అలీ నటించిన ఈ చిత్రానికి నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్‌శంకర్ ఎస్.