శుక్రవారం, జూన్ 29, 2012, 8:27 [IST]
ఆర్య 2 కోసం దేవి ఇచ్చిన ఐటం ట్యూన్ ‘రింగ రింగ..' పాట సల్మాన్‌ఖాన్ నటించిన ‘రెడీ'లో ‘దింక చిక..' పేరిట హిందీలో అదరకొట్టింది. అలాగే సోనూసూద్ నటిస్తున్న హిందీ చిత్రం ‘మాగ్జిమమ్'లో ‘అ అంటే అమలాపురం..' పాటను ఉపయోగించారు. తెలుగులో హిట్ అయిన ఈ రెండు ప్రత్యేక పాటలు ఉత్తరాదివారిని కూడా ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ పాటలే దేవిని బాలీవుడ్‌లో బాగా పాపులర్ చేశాయి.
ఇక ఇప్పుడు స్ట్రైయిట్ గా పూర్తి పాటలతో ‘జంజీర్'లో అధరకొడతానంటున్నాడు. ఈ సినిమా హిట్టైతే వరసగా పెద్ద హీరోల నుంచి,సంస్ధల నుంచి ఆపర్స్ వస్తాయనటంతో సందేహం లేదు. అందులోనూ సౌత్ సినిమా గాలులు బాలీవుడ్ లో వీస్తున్న సమయమిది. ఇక అమితాబ్‌బచ్చన్ నటించిన ‘జంజీర్'కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం కావటంతో మంచి క్రేజ్ ఉండబోతోంది.