NEWS

Blogger Widgets

29.6.12

అమాయక మత్య్సకారులపై పోలీస్‌ తూటా


ఎన్టీపీసీ నిర్లక్ష్యంపై మత్స్యకారుల ఆందోళన

స్విచ్‌గేర్‌ గేట్‌వద్ద కుటుంబాలతో నిరసన
కాల్పుల్లో ఇద్దరికి గాయాలు : ఉద్రిక్తత.. రణరంగం
అనకాపల్లి (వి.వి) : మౌలిక సదుపాయాలు, ఉపాధి హామీ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ జిల్లా పరవాడ మండలం తిక్కవానిపాలెం గ్రామ స్తులు ఎన్‌టిపిసి స్విచ్‌గేర్‌ రూమ్‌ గేటు వద్ద గురు వారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తం..
రణరంగంగా మారింది. గత 18 సంవత్సరాలుగా మత్స్యకారులు తమకు ఉపాధి హామీ కల్పించాలని ఎన్‌టిపిసి యాజమాన్యంతో చర్చించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో సుమారు 500 మత్స్యకారులు కుటుంబాలతో సహా ఆందోళనకు దిగారు. ఉదయం నుంచే మత్స్యకారులు స్విచ్‌గేర్‌ గేటు వద్ద బైటాయించారు. ఎన్‌టిపిసి అధికారుల సమాచారంతో విశాఖ జోన్‌ పరిధిలోని గాజు వాక, గంట్యాడ, కూర్మన్నపాలెం, స్టీల్‌ప్లాంట్‌ నుంచి భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందితోపాటు రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, సిఎస్‌ఎఫ్‌ బలగాలు అక్క డకు చేరుకొని మత్స్యకారులను భయోత్పాతానికి గురిచేశాయి. అక్కడితే ఆగని పోలీసులు ఏకంగా అమాయకులైన మత్స్యకారులపై కాల్పులు జరి పారు. పోలీసుల తూటాలకు సూరాడ మసేన్‌, సూరాడ బంగారి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఎవరికీ తెలియ కుండా పోలీసులు అంబులెన్స్‌లో విశాఖ కెజి హెచ్‌కు తరలించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై అమానుషంగా కాల్పులు జరిపి గాయపరచిన సిఎస్‌ఎఫ్‌ పోలీసులపై జ్యుడిషియల్‌ విచారణ జరిపించాలని మత్స్యకార నాయకులు సత్యనారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఇది ఎటువైపు దారితీస్తుందో అని జిల్లా కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌ హుటాహుటిన సాయంత్రం 5 గంటల సమ యంలో సంఘటనా స్థలానికి చేరుకొని ఏం జరిగిం దో మత్స్యకారులను అడిగి తెల్సుకున్నారు. గత 18 సంవత్సరాలుగా తిక్కవానిపాలెం గ్రామంలో మౌలిక వసతులు సైతం కోల్పోయామని కుటుం బాలు కలెక్టర్‌ వద్ద విలపించాయి. గ్రామస్తులకు ఉపాధి కల్పించాలని ఎన్‌టిపిసి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని నాయకులు తెలిపారు. ఎన్‌టిపిసి ద్వారా వచ్చే వ్యర్థం సము ద్రంలో కలిసి చేపలు చనిపోతున్నాయని దీంతో తమ జీవనాధారమైన మత్స్యసంపదను కోల్పో యామని అన్నారు. అయినప్పటికీ ఎన్టీపీసీ యాజ మాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు కుటుంబాలతో శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అమా యకులపై కాల్పులకు తెగబడ్డారని, ఇదేమి న్యాయ మని కలెక్టర్‌ను నిలదీశారు. దీనిపై కలెక్టర్‌ అగ ర్వాల్‌ మాట్లాడుతూ ఫైరింగ్‌ చేయడానికి గల కారణాలను విచారించి సిఎస్‌ఎఫ్‌ పోలీసులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల నిర్వాసితు లైన మత్స్యకారులను యాజమాన్యం పట్టించుకోక పోవడం దారుణమని త్వరలోనే ఎన్‌టిపిసి యాజమాన్యంతో సమావేశం నిర్వహించి మత్స్య కారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ హామీపై సంతృప్తి చెందని మత్స్యకారులు యాజ మాన్యంతో హామీ ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే కలెక్టర్‌ ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ను సంఘ టనా స్థలానికి పిలిపించి మత్స్యకారులకు హామీ ఇప్పించారు. దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. ఇదిలావుండగా విశాఖ సిటీ పోలీసు కమిషనర్‌ పూర్ణచంద్రరావు విలేకరులతో మాట్లా డుతూ మత్స్యకారులు స్విచ్‌గేర్‌ రూమ్‌పై రాళ్లు రువ్వడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసారే తప్ప కాల్పుల జరపలేదని చెప్పారు. మత్స్య కారుల రాళ్లదాడిలో పోలీసులకు, విఆర్‌వోలకు గాయాలయ్యాయన్నారు. అయితే మత్స్యకారులకు దొరికిన బుల్లెట్లు ఎక్కడివని విలేకరులు ప్రశ్నించగా వాటిపై విచారణ చేస్తామని దాటివేశారు. మత్స్య కారులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడికి రాకపోవడం గమనార్హం.

కాగా కలెక్టర్‌ వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి బండారు సత్య నారాయణమూర్తి కలెక్టర్‌ వెంటే వచ్చి తూ.తూ. మంత్రంగా రెండు ముక్కలు మాట్లాడి అక్కడి నుంచి ఉపక్రమించారు.