గురువారం, జూన్ 28, 2012, 8:08 [IST]
తాము చెప్పిన కథ విని ఎగ్జయిట్ అయిన ఎన్టీఆర్ వెలకట్టలేని ఒక బహుమతిని ప్రామిస్ చేశారని కోన వెంకట్ ఆనందంతో చెప్పుతున్నారు......
ఈ విషయాన్ని కోన వెంకట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తాజా చిత్రం ‘బాద్‌షా'చిత్రానికి కోన వెంకట్, గోపి మోహన్ కథ అందించారు. కధ విపరీతంగా నచ్చిన ఎన్టీఆర్ ఈ రకంగా స్పందించారని చెప్పుతున్నారు. ఎన్టీఆర్ కు ఇంతలా నచ్చిన ఈ చిత్రం గ్యారెంటీగా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.
ఇక ఈ ‘బాద్‌షా' కోసం ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. ప్రధానంగా ఆయన హెయిర్ డిజైన్ లో మార్పు కనిపిస్తుందని తెలిసింది. దీనికోసం ముంబయ్ నుంచి ఓ ప్రముఖ కేశాలంకార నిపుణుడ్ని హైదరాబాద్ కి రప్పించారు. అందుకే ఫస్ట్ షెడ్యూల్ అయ్యేవరకూ ఈ సినిమాకి చెందిన ఎన్టీఆర్ ఫోటోలు సీక్రెట్ గా ఉంచనున్నారు. ఆ గెటప్ అదిరిపోతుందని దర్శకుడు శ్రీనువైట్ల నమ్మకంగా ఉన్నారు.
శ్రీను వైట్ల దర్శకత్వంలో గణేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చిలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఆ తర్వాత సంగీతదర్శకుడు తమన్ ఆధ్వర్యంలో పాటల రికార్డింగ్‌ని ఆరంభించారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ని జూలై 1న ఇటలీలో ఆరంభించనున్నారు. తొలి షెడ్యూల్‌లో కొంత టాకీ, రెండు పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. టాకీ పార్ట్‌లో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిశోర్ పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో ముఖ్యంగా వినోద ప్రధానంగా సాగే సన్నివేశాలను చిత్రీకరిస్తారు.
ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.