NEWS

Blogger Widgets

29.6.12

మావోయిస్టుల బంద్‌లో హింసాకాండ


Thu, 28 Jun 2012, IST  

కాల్పుల్లో పోలీసు మృతి
రైల్వే ట్రాక్‌ల పేల్చివేత
రాంచీ : నిషేధిత సిపిఐ (మావోయిస్టు) పార్టీ ఇచ్చిన 24గంటల జార్ఖండ్‌ బంద్‌ పిలుపులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి....
బుధవారం మావోయిస్టులు పెట్రోలింగ్‌ పార్టీపై కాల్పులు జరపటంతో ఒక పోలీసు కానిస్టేబుల్‌ మరణించాడు. అంతేకాకుండా, ధన్‌బాద్‌ జిల్లాలో మావోయిస్టులు రైల్‌ ట్రాక్స్‌ను పేల్చివేసి రైలు సర్వీసులకు ఆటంకం కలిగించారు. సమీప రాష్ట్రమైన ఒడిషాలో మావోయిస్టు క్యాడర్ల అరెస్ట్‌లను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనల నడుమ మంగళవారం రాత్రి బంద్‌ ప్రారంభమైంది. 'జార్ఖండ్‌ రాజధాని రాంచీకి దాదాపు 210 కి.మీ.ల దూరంలో ఉన్న ధన్‌బాద్‌ జిల్లాలోని గ్రాండ్‌ ట్రంక్‌రోడ్డుకు సమీపాన టోప్‌చాంచి వద్ద పెట్రోలింగ్‌ పార్టీపై మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. కాగా, ఈ సంఘటనలో ఒక పోలీసు మృతిచెందగా,15 మంది ఇతరులు గాయపడ్డారు' అని రైల్వే భద్రతా దళం డివిజనల్‌ కమాండర్‌ శశి కుమార్‌ చెప్పారు.ధన్‌బాద్‌లోని ఆసుపత్రిలో క్షతగాత్రులను చికిత్స కోసం చేర్పించినట్లు ఆయన తెలిపారు. ధన్‌బాద్‌ జిల్లాలోని టెటుల్మరి దగ్గరలోని రైల్వే ట్రాక్స్‌ను ప్రత్యర్థులు పేల్చివేయటంతో రైల్వే సర్సీసులకు 6 గంటలపాటు అంతరాయం ఏర్పడింది. ఉదయం 7-30గంటలకు మరమ్మత్తులు పూర్తిచేయటంతో రైల్వే ట్రాక్‌పై రాకపోకలు పునరుద్ధరించబడ్డాయని వివరించారు.'రాంచీకి 100 కి.మీ.ల దూరంలో ఉన్న లతేహర్‌ జిల్లాలో రైల్వేస్టేషన్‌కు దగ్గరలోని రైల్వేలైన్లను పేల్చివేయటంతో పాటు అదేసమయంలో హెహెగర్హా రైల్వే స్టేషన్‌ భవనాన్ని కూడా మావోఇస్టులు దగ్ధం చేశారు' అని ఆయన తెలిపారు.