NEWS

Blogger Widgets

10.6.12

అభిలాష ఉంటే చాలదు


రాష్ట్రపతి కావాలనే అభిలాష ఉన్నంత మాత్రానికే ఏ ఒక్కరూ రాష్ట్రపతి కాజాలరని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఊహాగానాలు మిన్నంటుతున్న వేళ అవకాశాలున్న అభ్యర్థిగా ప్రచారం పొందిన ప్రణబ్‌ తొలిసారి పెదవి విప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వ నిర్ణయం బాధ్యత కాంగ్రెస్‌ పార్టీదేనని ఆయన తేల్చి చెప్పారు. శనివారం కొల్‌కతాలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత అభిలాష ఉన్నంతనే ఎవరూ రాష్ట్రపతి కాజాలరన్నారు. రాష్ట్రపతి ఎవరనేది పార్టీయే నామినేట్‌ చేస్తుందన్నారు. తదుపరి రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున ప్రణబ్‌ముఖర్జీ పేరు దాదాపుగా ఖరారైనట్లు శుక్రవారం కథనాలు వెలువడిన విషయం విదితమే. దీనిపై ఈనెల 15న స్వయంగా సోనియా గాంధీయే ఒక ప్రకటన చేయనున్నట్లు ఆ కథనాల సారాంశం. ఈ మేరకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రణబ్‌ముఖర్జీ పేరును సోనియా స్వయంగా ప్రకటిస్తారని వివిధ రాజకీయ విశ్లేషణలు సాగాయి. శుక్రవారం నాడే ప్రణబ్‌తో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ ముఖాముఖి భేటీ కావడమూ ఈ కథనాలకు బలం చేకూర్చింది. కాగా కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనే అంశంపై ముసుగు ఎన్నికల సంఘం ప్రకటన అనంతరం తొలగిపోతుందని భావిస్తున్నారు.