NEWS

Blogger Widgets

10.6.12

ఆప్ఘన్‌లో నాటో బలగాలపై తాలిబాన్ల దాడి



నలుగురు ఫ్రెంచ్‌ సైనికులు మృతి
కాబూల్‌ : ఆప్ఘనిస్తాన్‌ తూర్పు ప్రాంతంలో నాటో బలగాలపై తాలిబాన్లు జరిపిన దాడిలో నలుగురు ఫ్రెంచ్‌ సైనికులు మరణించారు. కపిస రాష్ట్రంలో ఈ దాడి జరిగిందని ఆప్ఘన్‌ అధికారులు తెలిపారు. ఆత్మాహుతి బాంబర్లలో ఒకరు ఈ దాడి చేశారని తాలిబాన్‌ ఉగ్రవాదులు తెలిపారు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి మొత్తం నాటో బలగాలను ఉపసంహరించడానికి రెండేళ్ళ ముందే ఈ ఏడాది చివరకు ఫ్రాన్స్‌ తన బలగాలను తొలగించనున్న విషయం తెలిసిందే. ఇటీవల కొద్ది వారాలుగా ఆఫ్ఘనిస్తాన్‌ అంతటా హింస బాగా పెరిగిపోంది. ఇక్కడ తాలిబాన్లు ఆప్ఘన్‌ బలగాలతో పాటు దేశంలో ఉన్న 1,30,000 విదేశీ బలగాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. పైన ముసుగేసి ఉన్న ఫ్రెంచ్‌ నాటో వాహనంపై తాలిబాన్లు శనివారం ఆత్మాహుతి దాడి జరిపారని ఆప్ఘన్‌ అధికారులు తెలిపారు. ఇక్కడ విదేశీ బలగాల్లో ఫ్రాన్స్‌ ఐదో అతి పెద్ద దేశంగా ఉంది. దాదాపుగా 3,300 మంది ఫ్రెంచ్‌ సైనికులు ఆప్ఘనిస్తాన్‌లో ఉన్నారు. తాజా మరణాలతో 2001 నుంచి ఈ దేశంలో మరణించిన మొత్తం ఫ్రెంచ్‌ సైనికుల సంఖ్య 87కి పెరిగింది. కపిసలోనే నలుగురు ఫ్రెంచ్‌ సైనికులను ఇంతకుముందు జనవరిలో తాలిబాన్లు హత్య చేసినప్పుడు తమ దేశ బలగాలను 2013 నాటికి ఆప్ఘనిస్తాన్‌ నుంచి ఉపసంహరిస్తామని అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీ ప్రకటించారు. గత నెలలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండే తాను ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చుతూ ఈ ఏడాది చివరకే బలగాలను ఆప్ఘన్‌ నుంచి ఉ పసంహరిస్తానని ప్రకటించారు.