NEWS

Blogger Widgets

10.6.12

ప్రయోగాల నటసింహ




 
పౌరాణికం, జానపదం, సాంఘికం.., ఏక పాత్ర, ద్వి, త్రి పాత్ర..జానర్‌ ఏదైనా, పాత్ర లెన్నరుునా..తనదైన శైలి ఆహార్యం- ఆంగికం, కొత్తదనంతో ఆకట్టుకోవడంలో బాలయ్య స్టైలే వేరు. ఇటీవల ‘శ్రీరామరాజ్యం’లో శ్రీరాముని పాత్రలో నందమూరి తారకరాముని మరోసారి తెరపై ఆవిష్కరించారు. దర్శకుడు బాపు కుంచెనుంచి జాలువారిన నీలవర్ణమేఘశ్యామ శ్రీరామ అంటే ఇలానే ఉంటాడేమో అనిపించేంత గొప్ప రూపుతో దర్శనమిచ్చాడు. నటనలోనూ హావభావాల్లోనూ అన్న ఎన్టీఆర్‌ అంతటి చాతుర్యాన్ని చూపాడు. నిర్మాత ఎలమంచిలి సారుుబాబు ఏ విలువలకరుుతే కట్టుబడి ఈ చిత్రాన్ని నిర్మించారో..వాటిని తెరపై ధారాలంగా పండించడంలో బహునేర్పరి అనిపించుకున్నారు. 
 
మరో సినిమా ‘అధినాయకుడు’లో మూడు తరాల రూపాల్లో 3 విభిన్న వేషాలు కట్టి ప్రేక్షకాభిమానుల మనసుదోచారు. తదుపరి చిత్రాలు ‘ఊకొడతారా...ఉలిక్కిపడతారా’, శ్రీమన్నారాయణ..లోనూ వైవిధ్యమైన పాత్రలలోనే కనిపించనున్నారు. ‘తాతమ్మ కల’ (1974)తో సినీరంగంలో అడుగుపెట్టి, ‘మంగమ్మగారి మనవడు’ (1984)తో హీరో అరుున బాలకృష్ణ ‘ఆదిత్య 369’ సీెక్వల్‌ ‘ఆదిత్య 999’తో మరో ప్రయోగం చేయనున్నారు. నేడు నటసింహా పుట్టినరోజు.