NEWS

Blogger Widgets

10.6.12

మైనారిటీ సబ్ కోటాపై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేంద్రం



Supreme
ఐఐటీ వంటి కేంద్ర విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మైనారిటీలకు 4.5 శాతం రిజర్వేషన్‌ను కేటాయించడాన్ని కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 27 శాతం ఓబీసీ కోటా పరిధిలో మైనార్టీలకు రిజర్వేషన్ విషయమై కేంద్రం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. కేంద్రం పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ కేఎస్.రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ ఖేహర్ ధర్మాసనం దీనిపై సోమవారం వాదనలను ఆలకించనుంది. 

విస్తృతమైన సర్వే నిర్వహించిన అనంతరం మైనార్టీలకు కోటా కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పు సబబు కాదని కేంద్రం తన పిటిషన్‌లో స్పష్టం చేసింది. కేంద్రం సాధారణ దృష్టితో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్ పరిధిలో మైనార్టీలకు 4.5 శాతం సబ్ కోటా కల్పించిందని హైకోర్టు గత నెల 28న పేర్కొంది.