నెలాఖర్లో ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా?’
బాలకృష్ణ, మనోజ్ ప్రధానపాత్రధారులుగా మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా?’. శేఖర్‌రాజా దర్శకత్వంలో మంచు లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెలాఖరుకు విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత మల్టీ స్టారర్ చిత్రంగా నిర్మితమైన ఈ చిత్రంలో బాలకృష్ణ చేసిన పాత్రకు హైవోల్టేజ్ రెస్పాన్స్ వస్తుందని, అలాగే మనోజ్ కూడా స్టార్ హీరోగా ఎదుగుతాడని ఆమె తెలిపారు. గుడ్ సినిమాల దారివేరు. యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల దారి వేరు. కానీ ఈ రెండూ ఈ చిత్రానికి తోడై ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులు ఆనందిస్తారని, ఓ మంచి చిత్రాన్ని నిర్మించానన్న ఆనందం అందరి ఆదరణ చూస్తే తెలుస్తోందని, ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, ఈ నెలాఖరి వారంలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా బాలకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆమె వివరించారు. దీక్షాసేథ్, లక్ష్మీప్రసన్న, సోనూసూద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: బోబోశశి, నిర్మాత: మంచు లక్ష్మిప్రసన్న, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్‌రాజా.