NEWS

Blogger Widgets

10.6.12

ప్రచారానికి నేటితో తెర


 
నేటి సాయంత్రం 5 కల్లా
ఇత ప్రాంతాల ప్రచారకర్తలంతా వెళ్లిపోవాలి
ఎన్నికలపై సీఈవో భన్వర్‌లాల్..
నా పని తీరు నాకే సంతృప్తి లేదు
ఉప ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగియనుంది. ఉప ఎన్నికల సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రచాకర్తలు ఆదివారం సాయంత్రం 5 గంటలకల్లా అక్కడి నుంచి వెళ్లిపోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. సాయంత్రం 5 తర్వాత బల్క్ ఎస్సెమ్మెస్‌లకూ అనుమతి లేదన్నారు. 
 
ఎలక్ట్రానిక్ మీడియాసహా ఇంటింటి ప్రచారం కూడా నిషిద్ధమని చెప్పారు. భద్రత కోసం 138 కంపెనీల కేంద్ర బలగాలను తరలించినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాలవద్ద వీడియో చిత్రీకరణ కోసం ట్రిపుల్ ఐటీలనుంచి 5,500 మందిని సన్నద్ధం చేశామన్నారు. ప్రత్యక్ష ప్రసారం కోసం 95 శాతం కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇప్పటివరకు రూ.41 కోట్ల నగదు, 2 కోట్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 'మీపై టీడీపీ, కాంగ్రెస్అసంతృప్తిగా ఉన్నాయి కదా?' అని ప్రశ్నించగా 'వారినే అడగం'డంటూ దాటవేశారు. 
 
ఎన్నికల చట్టంలో సవరణలు తేవాలి
ఆన్‌లైన్ సిటీబ్యూరో: మద్యం, డబ్బు పంపిణీ నివారణకు ఎన్నికల చట్టంలో సవరణలు తప్పక తేవాల్సి ఉందని భన్వర్‌లాల్ అన్నారు. 'విశాలాంధ్ర వజ్రోత్సవాల' సందర్భంగా శనివారం 'ప్రజాస్వామ్యం-ఎన్నికలు-డబ్బు ప్రభావం'పై ప్రసంగించారు. సఈవో హోదాలో సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు పలువురు తనను ప్రశంసిస్తున్నా, తన పనితీరుపై తనకే సంతృప్తి లేదని స్పష్టం చేశారు. తమకు పూర్తి అధికారాలు లేనందువల్ల ఎన్నికలను సమర్థంగా నిర్వహించలేని దుస్థితి ఉందన్నారు. చట్ట సవరణ కోసం ప్రజలే ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.