జగన్‌ను కోఠి సిబిఐ కార్యాలయానికి తరలించేందుకు పది వాహనాలతో కూడిన కాన్వాయ్‌ని సిబిఐ తీసుకు వచ్చింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో అతనిని తీసుకు వెళ్లారు. ఈ కాన్వాయ్‌లో ఎపిపిఎస్, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, టాస్క్ ఫోర్సు పోలీసులు ఉన్నారు. జగన్ జైలు నుండి నవ్వుకుంటూ బయటకు వచ్చి అభివాదం చేసుకుంటూ వాహనం ఎక్కారు. సాయంత్రం ఐదు గంటల వరకు జగన్‌ను సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు.
కాగా ఇంతకు ముందు ఐదు రోజుల పాటు సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను ప్రశ్నించారు. మరో రెండు రోజులు తమ కస్టడీకి కావాలని సిబిఐ కోర్టును కోరడంతో కోర్టు అనుమతించింది. దీంతో శనివారం ఆయనను ప్రశ్నించారు. ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. వైయస్ జగన్‌ను సిబిఐ 27వ తేదీ సాయంత్రం అరెస్టు చేసి, 28వ తేదీన చంచల్‌గుడా జైలుకు తరలించింది. ఆ తర్వాత జగన్‌ను భారతి మే 29, 30, 31 తేదీల్లో జైలులో ములాఖత్‌లో కలిసారు. ఆ మరునాడు జూన్ 1న ఆమె జగన్‌ను కలవడానికి రాగా నిబంధనల ప్రకారం కుదరదని జైలు అధికారులు తిరస్కరించారు.
నాలుగురోజులు జగన్‌ను కోఠి సిబిఐ కార్యాలయంలో విచారించినపుడు జగన్‌ను కలవడానికి సిబిఐ అధికారులు ఎవరికీ అనుమతివ్వలేదు. శుక్రవారం ఉదయం భారతి జగన్‌ను కలిసి సుమారు నలభై నిమిషాలు మాట్లాడి వచ్చారు. అలాగే జైలులో సాధారణ ఖైదీలుగా వున్న కోనేరు ప్రసాద్‌ను ఆయన సన్నిహితుడు, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ శుక్రవారం ములాఖత్‌లో కలిశారు. విచారణ ఖైదీగా వున్న ఐఎఎస్ అధికారి బి.పి.ఆచార్యను ఆయన భార్య బి.పి.రంజన్ టక్కర్ ఆచార్య కలిసి వెళ్లారు.