చదువు ఎక్కక...ఊరిలో వ్యవసాయం కలిసి రాక..వేరే ఊరెళ్లి బతుకలేక...చివరికి దర్శకుడయ్యారు ఇ.వి.వి సత్యనారాయణ. జీవితంలో తాను ఏదెైతే సాధించాల నుకున్నారో అది సాధించుకున్నారు. సినీ నిర్మాత నవత కృష్ణంరాజుకు మేనల్లుడెైన సుబ్బరాజు ఇచ్చిన సిఫారసు లేఖ తీసుకొని మద్రాసులోని కృష్ణ్ణంరాజును కలిశారు ఆనాడు. కృష్ణంరాజు సొంతూరికి తిరిగెళ్లమని వారించినా..మొండి పట్టు వీడకుండా మద్రాసు వీధుల్లో చక్కర్లు కొట్టారు. పాండిబజారులో తిరుగుతూ.. అక్కడ సహాయ దర్శకుల పిచ్చాపాటి ఆసక్తిగా ఆలకించేవారు. ప్రతి రోజూ ఉదయమే నవత కృష్ణ్ణంరాజు ఆఫీసు గేటు వద్ద నిలబడి ఉండేవారు. అలా నెల ముగిశాక..ఈవివి పట్టుదల కృష్ణంరాజును కదిలిచి... సహాయ దర్శకుడిని చేశారా యన. దేవదాసు కనకాల ’ఓ ఇంటి బాగోతం’ సినిమాకు సహాయ దర్శకుడిని చేశారు. అలా మొదలెైన ఇవివి ప్రస్థానం తెలుగుతెరపెై చెరగని సంతకమైంది. 56వ జయంతి నేడు.