NEWS

Blogger Widgets

22.6.12

జింబాబ్వేతో ట్వంటీ20: బంగ్లా ఆరు వికెట్ల తేడాతో గెలుపు!



FILE
జింబాబ్వేతో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాసిర్ హుస్సేన్ (31 బంతుల్లో 41; ఫోర్లు 3) చెలరేగడంతో జింబాబ్వేపై బంగ్లాదేశ్ గెలిచింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను కంగుతినిపించిన జింబాబ్వే జట్టు ఈ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 17.3 ఓవర్లలో 153/4 పరుగులు చేసింది. 

కాగా, జింబాబ్వే ముక్కోణపు సిరీస్ జరుగనుంది. జింబాబ్వే - బంగ్లాదేశ్ - దక్షిణాఫ్రికా జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ పోటీల్లో జింబాబ్వే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా నాలుగు పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.