NEWS

Blogger Widgets

22.6.12

వికీలీక్స్ చీఫ్ జులియన్ అస్సాంజే అరెస్టు ఖాయం : బ్రిటన్


వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియాన్ అస్సాంజే అరెస్టు తప్పదని బ్రిటన్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అస్సాంజే లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో రాజకీయ శరణార్థిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ఆయనను స్వీడన్‌కు అప్పగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పోరాడుతున్న అస్సాంజే బెయిల్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ఆయనను అరెస్ట్‌ చేస్తామని బ్రిటన్ పోలీసులు ప్రకటించారు. కాగా, అస్సాంజే రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కోరుతున్న నైట్‌బ్రిడ్జ్‌ జిల్లాలోని మార్కెట్‌ వద్ద ఉన్న ఐదు అంతస్తుల ఎరుపురంగు భవనం ఎదుట 'అస్సాంజేను విడుదల చేయాలి' అని డిమాండ్‌ చేస్తూ ఫ్లకార్డులతో ఆయన మద్దతుదారులు ప్రదర్శన చేశారు. 

ఇది బ్రిటన్‌ న్యాయ, దౌత్యాధికారులకు తలనొప్పిగా మారింది. ఇద్దరు మహిళలపై లైంగిక దాడులు చేశాడనే ఆరోపణలపై అస్సాంజేను ప్రశ్నించాలని స్వీడన్‌ ప్రాసిక్యూటర్లు కోరుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అస్సాంజేను స్వీడన్‌కు అప్పగించాలని వారు కోరుతున్నారు.