NEWS

Blogger Widgets

22.6.12

2014లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని డిసైడ్ అయ్యారా..?: చిరంజీవి


WD
2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని డిసైడ్ అయిపోయినట్లు నాయకులు భావిస్తుండటంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో పూర్తి నిరాశ నెలకొని ఉందని చిరంజీవి వ్యాఖ్యానించారు. రామచంద్రాపురంలో కార్యకర్తల సమావేశంలో చిరు మాట్లాడారు. 

కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరాశ నెలకొని ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాదనే భావన నెలకొని ఉందన్నారు. ఐతే కాంగ్రెస్ - పీఆర్పీ కార్యకర్తలు సమన్వయంతో కలిసి నడిస్తే గెలుపు ఖాయమని రామంద్రాపురం, నర్సాపురం ఎన్నికలు నిరూపించాయన్నారు. 

కాంగ్రెస్, పీఆర్పీ కార్యకర్తల మధ్య సమన్వయం లేకనే తిరుపతిలో ఓడిపోయామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మార్పు వస్తుందని ఇంతకాలం ఎదురుచూశానని అన్నారు. ఇకనైనా కార్యకర్తల్లో ఉత్సాహం నింపి 2014 ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

పార్టీలో అనైక్యతే ప్రత్యర్థులకు పెద్ద బలమనీ, ఐక్యంగా కలిసి ముందుకు వెళితే 2014 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటామని అన్నారు. వెంటనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తమ్మీద కాంగ్రెస్ నాయకుడైనా ఇంకా పీఆర్పీ నీడలు చిరును వీడటం లేదు. మరి కాంగ్రెస్ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.