NEWS

Blogger Widgets

22.6.12

పెటా అంబాసిడర్‌






2007లో మిస్‌ ఇండియాగా కీర్తికిరీటాన్ని అందుకున్న పూజాగుప్తా మిస్‌ యూనివర్స్‌గా పోటీచేసి తొమ్మిదవ స్థానం దక్కించుకుంది. న్యూఢిల్లీకి చెందిన పూజా పలు మోడలింగ్‌ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంది. 2011లో ఫాల్తు చిత్రంలో నటించింది. ప్రస్తుతం హీరో నీల్‌ నితిన్‌ ముఖేష్‌తో కలిసి ‘షార్ట్‌కట్‌ రోమియో’, సైఫ్‌ ఆలీ ఖాన్‌తో కలిసి ‘గో గోవా గాన్‌’ చిత్రాలలో నటిస్తోంది. అయితే ప్రతిష్టాత్మక పెట (జంతు సంరక్షక సంస్థ)కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఇకపెై వ్యవహరించనుంది. పూర్తిగా శాఖాహారమే తినాలని... జంతువులను రక్షించాలని ‘పెట’ ప్రచారం చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ యాడ్‌ ఫిల్మ్‌లో నటించింది పూజ గుప్తా. త్వరలో ఆ యాడ్‌ ఫిలిం ప్రసారం కానుంది. ప్రతి వెజిటేరియన్‌ నుంచి సంవత్సరానికి కనీసం 100 జంతువులు కాపాడబడతాయి అనే అంశాన్ని ఈ సరికొత్త యాడ్‌లో క్యాప్షన్‌గా చూపించబోతున్నారట. తన అభిమానులు ఏ కొందరెైనా ఈ యాడ్‌ చూసి వెజిటేరియన్లుగా మారిపోతే అంతకన్నా భాగ్యం ఇంకేముంటుందంటోంది పూజాగుప్తా.