NEWS

Blogger Widgets

1.7.12

రసపట్టులో కర్నాటకం



రంగంలోకి బిజెపి అధిష్ఠానం
రాజీనామాలు ఆమోదించేది లేదన్న బిజెపి
వెనక్కి తగ్గేది లేదని స్పష్టీకరణ
సదానంద జెడిఎస్‌ కీలుబొమ్మని నిప్పులు
బెంగళూరు : కర్నాటకలో రాజకీయ సంక్షో భం ముదిరింది. కర్నాటక ముఖ్యమంత్రి డివి సదా నందగౌడపై మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్‌ నేత బిఎస్‌ యడ్యూరప్ప వర్గం దాడిని ముమ్మరం చేసింది. ఆయన మంత్రులను ఏమాత్రం పరిగణన లోకి తీసుకోవడం లేదని విమర్శించింది. ప్రతిపక్ష జెడిఎస్‌ కీలుబొమ్మగా మారారని ధ్వజమెత్తింది. 9 మంది మంత్రులు రాజీనామా చేసిన మరుసటి రోజు సదానందగౌడపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టింది. మంత్రులు రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించింది. రాజీనామాల విష యంలో రాజీపడే ప్రసక్తేలేదని విస్పష్ట ప్రకటన చేసింది. తక్షణమే సదానందగౌడను తొలగించి తమ అభ్యర్ధిగా జగదీష్‌ షెట్టర్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. 'జెడిఎస్‌(మాజీ ప్రధాని హెచ్‌డి దేవగౌడ) ఆదేశాను సారం ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారు. అది అభి వృద్ధి కావచ్చు, నియోజకవర్గాలు కావచ్చు, మం త్రుల శాఖలు కావచ్చు. అన్నింటిలో జెడిఎస్‌ ఆ దేశాలనే సిఎం అమలు చేస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు' అని రాజీనామా చేసిన 9 మంది మంత్రుల్లో ఒకరైన సిఎం ఉదాసీ విమ ర్శించారు. ఉదాసీ శనివారం విలేకరులతో మాట్లా డారు. తాము రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు. మరోవైపు, యడ్యూరప్ప వర్గం మంత్రుల రాజీనామాలు ఆమోదించే ప్రసక్తే లేదని కర్నాటక బిజెపి అధ్యక్షుడు కె.ఎస్‌ ఈశ్వరప్ప స్పష్టం చేశారు. మంత్రుల రాజీనామాలు ఆమో దించే ప్రసక్తేలేదని సదానందగౌడతో సమావేశం తర్వాత ఈశ్వరప్ప విలేకరులకు చెప్పారు. పార్టీ నాయకత్వం నిర్ణయానికి సదానందగౌెడ, జగదీష్‌ షెట్టర్‌కు మద్దతిస్తున్న మిత్రులు కట్టుబడి వుంటా రన్న విశ్వాసాన్ని ఆయన వెలిబుచ్చారు. మరోవైపు, రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రశ్నేలేదని కార్మిక శాఖమంత్రి బిఎన్‌ బచ్చె గౌడ చెప్పారు. ముఖ్య మంత్రిని కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'నాయకత్వ మార్పు లేదు. సదానందగౌడ సిఎంగా కొనసాగు తారు' అని అన్నారు. కాగా, సదానందగౌడ శనివారం ఉదయం గవర్నర్‌ భరద్వాజను రాజ్‌భవన్‌లో కలిశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి గవర్నర్‌కు వివరించారు. ముఖ్యమంత్రిపై జెడిఎస్‌ ప్రభావం తీవ్రంగా వుందని ఉదాసీ విమర్శించారు. మంత్రుల పట్ల ఏమాత్రం విశ్వాసం సిఎంకు లేదన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రికి మధ్య నమ్మకం పూర్తిగా కొరవడిందని తెలిపారు. ఏ ఒక్క మంత్రిని విశ్వాసంలోకి తీసుకోవడం గానీ, సమస్యలపై సంప్రదించడం గానీ లేదని మండిపడ్డారు. గత మూడు, నాలుగు మాసాలుగా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఇందుకు తాను ఎన్నో ఉదంతాలను చూపించగలనని అన్నారు. ప్రజాపనులశాఖ మంత్రిగా షిరాడీ ఘాట్‌రోడ్‌ ప్రాజెక్టుపై తాను ముఖ్యమంత్రిని సంప్రదించానని, ఇది జపాన్‌ సాయంతో ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టు అని, అది ఇప్పటికీ ఆమోదానికి నోచుకోలేదని ఉదాసీ వివరించారు. జెడిఎస్‌ నాయకుని ఫిర్యాదు మేరకు ఎక్సైజ్‌ మంత్రి ఎం.పి.రేణుకాచార్యపై విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారని విమర్శించారు. అదే న్యాయశాఖమంత్రిగా ఎస్‌.సురేష్‌కుమార్‌ రాజీనామా చేస్తే ఆయనను పిలిచి మాట్లాడారని ఉదాసీ చెప్పారు. సొంత పార్టీ నాయకులు, మంత్రుల పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బిఎస్‌ యడ్యూరప్పపై అక్రమ మైనింగ్‌ కేసులో నివేదిక పంపాలని సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ ఆదేశించిన 24 గంటల్లోనే సదానందగౌడ ప్రభుత్వం ఆ పనిచేసిందని, ఇదే వ్యవహారంపై ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఎస్‌ఎం కృష్ణ, ఎన్‌.ధరమ్‌సింగ్‌, హెచ్‌డి కుమారస్వామిలపై నివేదిక పంపమంటే ఇప్పటి వరకు ఆ పనిచేయలేదని ఉదాసీ తీవ్రంగా విమర్శించారు. గౌడ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను సైతం పక్కప పెట్టిందని అన్నారు. ఈ ఏడాది మార్చిలోనే ఆరుగురు మంత్రులపై ఫిర్యాదు చేస్తూ పార్టీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కారీకి లేఖ రాశారని గుర్తు చేశారు. ఇదేనా సదానంద గౌడ వ్యవహరించాల్సిన తీరు అని నిలదీశారు. తమ పట్ల ముఖ్యమంత్రికి విశ్వాసం లేదని చెప్పారు. ఆయన పట్ల తమకు కూడా నమ్మకం కలగడం లేదని వివరించారు. పరస్పర విశ్వాసం లోపించినట్లు వెల్లడించారు. అందుబాటులో లేని ఇంథన శాఖమంత్రి శోభా కారంద్లజే కూడా తమ ద్వారా రాజీనామా లేఖ పంపినట్లు ఉదాసీ తెలిపారు. ఆ లేఖను కూడా ముఖ్యమంత్రి తీసుకున్నట్లు చెప్పారు. ఆ 9 మందిని యడ్యూరప్ప ప్రభావితం చేసినట్లు వచ్చిన వార్తలపై ఉదాసీ, జలవనరులశాఖమంత్రి బసవరాజ బొమ్మై ఖండించారు. ఇది పూర్తిగా అసత్యం, అబద్దమని చెప్పారు. తాజా సంక్షోభానికి యడ్యూరప్ప కారణమంటూ వచ్చిన విమర్శలను కూడా తిప్పికొట్టారు. 'మేము రాజీనామా చేశాం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు' అని బొమ్మై స్పష్టం చేశారు.