NEWS

Blogger Widgets

1.7.12

చిరంజీవి త్వరలో కేంద్రమంత్రి అవుతారు: లగడపాటి జోస్యం


WD
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన చిరంజీవి త్వరలోనే కేంద్రమంత్రి కాబోతున్నారని లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. అధిష్టానం ఆయనకు ఏ శాఖను కేటాయించాలన్నదానిపై చర్చిస్తోందని చెప్పుకొచ్చారు. శనివారంనాడు తిరుమలేశుని దర్శించుకున్న లగడపాటి విలేకరులతో మాట్లాడారు. ...

అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం చిరంజీవిని కేంద్రమంత్రిని చేస్తుందన్నారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదనీ, సమైక్యంగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొందరు రాయల తెలంగాణ, ఆంధ్రగా రెండు రాష్ట్రాలను విభజించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుందటగా అంటూ ఒక విలేకరి ప్రశ్నించగా... అవన్నీ తనకు తెలియవన్నారు.

తనకు తెలిసింది మాత్రం త్వరలోనే తెలంగాణ సమస్యకు కాంగ్రెస్ పార్టీ పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు తీవ్రంగా చర్చిస్తోందన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని అన్నారు