NEWS

Blogger Widgets

1.7.12

సనాఖాన్ పై త్రిష ఫైర్



త్రిష తాగుతుందో లేదో కానీ త్రాగుడు మ్యాటర్ లో వేలు పెట్టడం వల్లే ఆమె ఉలిక్కిపడినట్లైంది అంటోంది తమిళ మీడియా. రీసెంట్ గా..... మరో హీరోయిన్ సనాఖాన్..సౌత్ హీరోయిన్స్ త్రాగుతారు, సిగెరెట్స్ కాలుస్తారు అని కామెంట్ చేస్తే ఎక్కువ రెస్పాండ్ అయ్యింది త్రిష మాత్రమే. ఆమె ఈ విషయమై తమిళ నటీనటుల సంఘానికి సనాఖాన్‌పై తగిన చర్య తీసుకోమని త్రిష ఫిర్యాదు చేశారని వినికిడి.

కళ్యాణ్ రామ్ తో కత్తి,మంచు మనోజ్ తో మిస్టర్ నోకియా సినిమాల్లో చేసిన సనాఖాన్ ఆ మధ్యన మీడియాతో హీరోయిన్స్ త్రాగుడు మ్యాటర్ పై నోరు జారింది. ఆమె మాట్లాడుతూ..‘‘ఉత్తరాది హీరోయిన్స్ మందు పుచ్చుకుంటారని, సిగరెట్లు కాల్చుతున్నారని నిందిస్తారు. కానీ దక్షిణాది తారల్లో కొంతమంది ఈ రెండు వ్యవహారాలను జోరుగా సాగించడం నేను చూశాను. అసలు నార్త్ హీరోయిన్స్‌కన్నా సౌత్ హీరోయిన్స్ ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. కానీ వారి కార్యకలాపాలు బయటికి రావడంలేదు'' అని సనాఖాన్ కామెంట్ చేసింది.