NEWS

Blogger Widgets

1.7.12

వాయువ్య చైనాలో భూకంపం



వందలాది పశువులు మృతి
తీవ్రంగా దెబ్బతిన్న నివాసిత భవనాలు
బీజింగ్‌ : వాయువ్య చైనాలోని మారుమూల ప్రాంతం జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. శక్తివంతమైన ఈ భూకంపం వల్ల నివాసిత భవనాలు బాగా దెబ్బతిన్నాయి. 34 మంది క్షతగాత్రులు అయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.6గా నమోదైంది. స్వతంత్ర ప్రతిపత్తి గల జిన్‌జియాంగ్‌ ఉగుర్‌ రాజధాని ఉర్ముక్విలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.07 గంటలకు భూమి పెద్ద స్థాయిలో కంపించింది. దీంతో ఇళ్ళల్లో నిద్రిస్తున్న ప్రజలు ఒక్కసారిగా మేల్కొని బయటకు పరుగలు తీశారు. హెజింగ్‌, జిన్‌యువాన్‌ రాష్ట్రాల సరిహద్దుల పొడవునా ఉన్న పర్వత ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు కనుగొన్నారు. జిన్‌యువాన్‌ రాష్ట్రంపై ఈ భూకంపం ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో నివాసిత భవనాలు కూలిపోయాయి, దెబ్బతిన్నాయి. పశువుల కొట్టాలు కూలిపోవడంతో వందల సంఖ్యలో పశువులు మృతిచెందాయి. జిన్‌జి యాంగ్‌లో పలు జాతీయ, ప్రాంతీయ రహదారులపై కొండచరియలు, పెద్ద రాళ్ళు దొర్లిపడడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. జిన్హువా న్యూస్‌ ఏజన్సీ ఈ వివరాలు తెలిపారు. స్థానిక అధికారులు సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. భూకంపం సంభవించిన ప్రాంతం సముద్ర మట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో ఉందని నిపుణులు తెలిపారు.