పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడటమే అరుదు. ఆయన ఎవరినైనా పొగిడారంటే అదో గొప్ప విషయం. తాజాగా ‘గబ్బర్ సింగ్' హీరోయిన్ శృతి హాసన్‌పై ....ప్రశంసల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్. ఓ ప్రముఖ దిన పత్రికతో ఆయన మాట్లాడుతూ...శృతి హాసన్ చాలా హార్డ్ వర్క్, ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారు అంటూ కొనియాడారు. భవిష్యత్‌లో ఆమె పెద్ద హీరోయిన్ అవుతుదంటూ ఆశాభావం వ్యక్తం చేశారు పవన్.