చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో నిజమెంత ? అక్కడ ఎదరుకాల్పులు జరిగాయా ? చనిపోయిన వారంతా మావోయిస్టులేనే ? కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. అమయాక గిరిజనులను కాల్చి చంపారంటున్ని.....
మానవ హక్కుల సంఘాలు ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయ్.చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై నీలినీడలు అలముకుంటున్నాయ్. ఎదురుకాల్పుల్లో చనిపోయింది నక్సల్స్ కాదన్న అనుమానం బలపడుతోంది. శుక్రవారం చింతల్నార్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు. అయితే వీరంతా గిరిపుత్రులేననే వాదన వినపడుతోంది. మృతుల్లో ఎక్కువశాతం చిన్నపిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్‌కౌంటర్ మృతుల్లో నక్సలైట్లు కొందరే ఉన్నట్లు సమాచారం. గతంలో ఇదే ప్రాంతంలో 36 మంది నక్సల్స్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అప్పట్లోనూ భద్రతా దళాల చర్య అనుమానాలను రేకెత్తించింది. తాజాగా నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లోనూ మావోయిస్టుల పేర అమాయక గిరిజనులను, గ్రామస్తులను బలవంతంగా కాల్చి చంపారనే ఆరోపణ తెరపైకి వచ్చింది బస్తర్ ప్రాంతంలోని జేగురగొండ, బాసాగూడ మధ్య సెలిగార్ అడవుల్లో నక్సల్స్ మకాం వేశారన్న సమాచారంతో 300 మంది జావాన్లు కూంబింగ్‌కు చేపట్టారని మావోలను చుట్టుముట్టి దాడిచేయడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు ధృవీకరిస్తున్నారు. అయితే మృతదేహాలను చూస్తే మాత్రం అనుమానించాల్సి వస్తుందని మానవహక్కుల సంఘాలు గొంతెత్తుతున్నాయ్. దీనిపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయ్. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌తో చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని గిరిజనులు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని కాలం గడుపుతున్నారు.