కాబూల్‌కు ఉత్తర దిశగా ఉన్న సరిపాల్ రాష్ట్రంలోని జైలు గోడను తాలిబన్లు పేల్చివేశారు. ఈ సందర్భంగా ఆఫ్ఘన్ సెక్యూరిటీ సిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయని రాష్ట్ర డిప్యూటీ గవర్నర్ అక్తర్ మహ్మద్ వివరించారు.
ఈ ఘటనలో 31 మంది ఖైదీలు తప్పించుకోగా, వారిలో 16 మందిని పట్టుకున్నారని, మిగతా వారికోసం గాలిస్తున్నారని అక్తర్ మహ్మద్ వెల్లడించారు. సరిపాల్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి ఈ సంఘటనను ధ్రువీకరించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించారు.