NEWS

Blogger Widgets

9.6.12

లండన్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన సుధా సింగ్!



olympics
లండన్ ఒలింపిక్స్‌కు భారత అథ్లెట్, ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత సుధా సింగ్‌ అర్హత సాధించింది. ఇక్కడ జరుగుతున్న 8వ ఇబెరొమెరికనో డి అట్లేటిక్స్ చాంపియన్‌షిప్ 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో ఆమె అసాధారణ ప్రతిభ కనబరచి, గతంలో తాను నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలు చేసింది. 

గత నెల జరిగిన షాంఘై డైమండ్ లీగ్‌లో ఒలింపిక్స్ క్వాలిఫై మార్క్‌ను కొద్దిలో చేజార్చుకున్న 25 ఏళ్ల సుధా సింగ్ ఈసారి ఎలాంటి పొరపాటు చేయలేదు. 9 నిమిషాల 47.70 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన ఆమె గతంలో 9 నిమిషాల 49.25 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును అధిగమించింది. ఈ రేస్‌లో 11వ స్థానానికి పరిమితమైనప్పటికీ, లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత ఆమె సంపాదించగలిగింది.