NEWS

Blogger Widgets

9.6.12

ప్రముఖ దర్శకుడు కెఎస్‌ఆర్ దాస్ కన్నుమూత



చెన్నై, జూన్ 8: తెలుగు సినీ రంగానికి జేమ్స్‌బాండ్ చిత్రాలను పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు కెఎస్‌ఆర్ దాస్ శుక్రవారం ఇక్కడి అపోలో ఆస్పత్రిలో కన్నుమూసారు. 1936 జనవరి 5న నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దాస్ జన్మించారు. 1966లో వచ్చిన లోగుట్టు పెరుమాళ్లకెరుక ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం. హీరో కృష్ణతో ఆయన దాదాపు 30 సినిమాలు తీసారు. టక్కరి దొంగ చక్కని చుక్క, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా మోసగాళ్లకు మోసగాడు సినిమా తెలుగు చిత్రరంగం ట్రెండ్‌నే మార్చేసింది. ఎన్టీఆర్‌తో యుగంధర్, కాంతారావుతో రాజయోగం, రాజసింహ, గండరగండుడు, ఉక్కు పిడుగు సినిమాలు తీసిన ఆయన శోభన్ బాబు, రజనీకాంత్ లాంటి ప్రముఖ నటులతో కూడా చిత్రాలు తీసారు. ఎస్‌వి రంగారావు ప్రధాన పాత్ర పోషించిన కత్తుల రత్తయ్యతో పాటుగా పిల్లా- పిడుగా లాంటి మాస్ చిత్రాలను ఆయన తీసారు. ఆయన హిందీలో కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు.