NEWS

Blogger Widgets

9.6.12

పాకిస్థాన్‌పై అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించిన అమెరికా!


పాకిస్థాన్‌పై అమెరికా అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించింది. ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ తీవ్రవాదుల ఏరివేతలో నిమగ్నమైవున్న తమ దేశ సైనికుల రక్షణార్థం ఎలాంటి చర్యలైనా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు అమెరికా రక్షణ మంత్రి లియాన్ పనెట్టా ప్రకటించారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పాక్‌పై అమెరికా ప్రకటించిన అప్రకటిత యుద్ధమేనని పనెట్టా చెప్పినట్టు ఫాక్స్ న్యూస్ పేర్కొంది. 

ఈ అంశంపై పనెట్టా మాట్లాడుతూ.. ఆప్ఘనిస్థాన్‌లోని తమ భద్రతా బలగాలను రక్షించేందుకు ఎలాంటి చర్యలకైనా తాము వెనుకంజ వేయబోమని చెప్పారు. అంతేకాకుండా తాలిబన్‌తో పాటు పలు తీవ్రవాద సంస్థలకు చెందిన నేతలకు పాకిస్థాన్ సురక్షిత స్థావరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించినట్టు ఫ్యాక్స్ న్యూస్ పేర్కొంది. ముఖ్యంగా హక్కానీ నెట్‌వర్క్ నేతలు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రొవీన్స్‌లో తలదాచుకుంటున్నారని చెప్పారు. 

ఆప్ఘన్ సరిహద్దు ప్రాంతంలోని పాకిస్థాన్ సైనిక చెక్ పోస్టుపై అమెరికా దాడి చేయగా, 15 మంది పాక్ సైనికులు మృత్యువాత పడిన సంగతి తెల్సిందే. దీంతో అమెరికా, పాకిస్థాన్ దౌత్య సంబంధాలు బెడిసి కొట్టిన విషయం తెల్సిందే.