NEWS

Blogger Widgets

9.6.12

చిరంజీవికి ఈసి నోటీసు జారీ, తిరుపతి వ్యాఖ్యలకు


 Ec Issues Notice Chiranjeevi

హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. తిరుపతిలో మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈసి చిరంజీవికి ఆ నోటీసు జారీ చేసింది. చిరంజీవిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఈసి నోటీసు జారీ చేసింది. రేపు ఆదివారం 12 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసి చిరంజీవిని ఆదేశించింది.
ఉపఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావును ఎన్నికల సంఘం మందలించింది. తన నోటీసుకు ఆయన ఇచ్చిన వివరణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి పునరావృతమయితే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన ప్రచారంలో ధర్మాన చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
ఆయన మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. మంత్రికి నోటీసు పంపింది. దానికి మంత్రి వివరణ ఇవ్వగా, సంతృప్తికరంగా లేదంటూ రాష్ట్ర ఈసీకి సంబంధిత లేఖను పంపింది. "ఈసారికి మందలింపుతో వదిలేస్తున్నాం. మరో సారి పునరావృతం అయితే జరిమానా/ శిక్ష తప్పదు''అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ శుక్రవారం తేల్చిచెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి సూట్‌కేసును పోలీసులు తనిఖీ చేయడంపై స్పందిస్తూ - "ఎన్నికల నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి సూట్‌కేసునైనా తనిఖీ చేయాల్సిందే. అందులో తప్పేమీ లేదు'' అని తేల్చిచెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఈ ఉప ఎన్నికల్లో వెల్లువెత్తుతున్నాయి.