* రోడ్‌షోలో అనుమతి లేని వాహనాల సీజ్
* వాహనాల సీజ్‌పై వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల ఆగ్రహం
* కార్యకర్తలను శాంతింపజేసిన పరకాల డీఎస్పీ
మరోవైపు వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో విజయమ్మ చేపట్టిన ప్రచారంపై కేసు నమోదైంది. పరకాలలో చేపట్టిన రోడ్‌షోలో అనుమతి లేని వాహనాలను ఉపయోగించారంటూ పోలీసులు కేసు నమోదు చేసి.. వాహనాలను సీజ్ చేశారు. దీనిపై ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో గొడవకు దిగారు. దీంతో పరకాల అంబేద్కర్ సెంటర్ వద్ద రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు పరకాల డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని కార్యకర్తలను శాంతింపజేశారు.